Breaking News
Home / news / ఫ్లాష్ న్యూస్ జనతాగ్యారేజ్ కి ప్యాక్ అప్ చేస్తున్న ఎన్టీఆర్

ఫ్లాష్ న్యూస్ జనతాగ్యారేజ్ కి ప్యాక్ అప్ చేస్తున్న ఎన్టీఆర్

కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ చిత్రం రూపొందుతోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, నిన్ననే ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది.రెండు పాటలను మాత్రమే తెరకెక్కించవలసి వుంది. ఒక పాటను హైదరాబాద్ లోను .. మరో పాటను కేరళలోను ప్లాన్ చేశారట. తదుపరి షెడ్యూల్ లో ఈ రెండు పాటలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. flash news ki pack up chesthunna ntr

అన్నివర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ ఈ కథను సిద్ధం చేశాడని అంటున్నారు. కథా కథనాలు .. పాత్రలను మలచిన తీరు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాతో కొరటాల హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు. మ‌రోవైపు సినిమా ఆడియో వేడుక‌ను ఈనెల 22 న నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. హైద‌రాబాద్ లో భారీగా ఆడియో వేడుక నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి జనతా గ్యారేజ్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!