Breaking News
Home / news / గ్రాండ్ పార్టీ ఇచ్చిన ప్రభాస్

గ్రాండ్ పార్టీ ఇచ్చిన ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. గతేడాది ఇదేరోజున విడుదలైన ఈ సినిమా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ టీమ్‌తో పాటు, తన మిత్రులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రభాస్ ఈ పార్టీని ప్లాన్ చేసినట్లు సమాచారం.grand partey icchina prabhas

ప్రస్తుతం ‘బాహుబలి’కి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్‌’ను పూర్తి చేసే పనిలో పడిన రాజమౌళి టీమ్, పార్టీతో బాహుబలి సినిమా అనుభవాలను మరోసారి గుర్తుచేసుకునేలా ప్లాన్ చేసిందట. ఇక స్వతహాగా మిత్రులకు, ఇండస్ట్రీ ప్రముఖులకు పార్టీలు ఇవ్వడంలో ప్రభాస్‌కు ఉన్న పేరుకు తగ్గట్టుగానే, ఈ పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.  

 

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!