Breaking News
Home / news / హాలీవుడ్ చిత్రానికి వాయిస్‌ అందిస్తున్న జగపతిబాబు

హాలీవుడ్ చిత్రానికి వాయిస్‌ అందిస్తున్న జగపతిబాబు

హీరోగా ఆ తర్వాత విలన్‌ , క్యారెక్టర్‌ నటుడిగా సౌత్‌ పరిశ్రమను ఏలేస్తోన్న జగపతిబాబు ఇప్పడు హాలీవుడ్‌ కి వెళ్లిపోయాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఏసినిమా, పాత్ర ఏంటి అని అడుగుతున్నారా   విషయంలోకే వస్తున్నాం. స్టీవెన్ స్పీల్బర్గ్ తాజాగా తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం బీఎఫ్జీ ‘ద బిగ్ ఫ్రెండ్లీ జెయింట్’ శుక్రవారం అమెరికాలో విడుదలైంది. ఈ చిత్రాన్ని భారత్ లోనూ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. జులై 15న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. hollywood chitraniki voice andisthunna jagapatibabu

ఈ సందర్భంగా మూడు తెలుగు పోస్టర్లను అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వు వూహించిన దాని కంటే ఈ ప్రపంచము చాలా పెద్దది’ అంటూ పోస్టర్లపై ఉన్న అక్షరాలు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పుడీ సినిమాకే టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఈ చిత్రానికి వాయిస్‌ అందించారు. రచయిత రోల్డ్ దాల్ రాసిన బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!