Breaking News
Home / news / పవర్ స్టార్ కొత్త గెటప్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు

పవర్ స్టార్ కొత్త గెటప్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు

పవర్ స్టార్ పవన్‌కల్యాణ కొత్త గెటప్ బయటకువచ్చింది. ఆ గెటప్‌లో పవన్‌ కళ్యాణ్ ని చూసి.. ఫ్యాన్స్ ఖుషీ ఐపోతున్నారు. డాలీ డైరెక్షన్‌లో రానున్న మూవీ కోసమే కొత్త గెటప్‌ని సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. మీసం మెలేసి కొత్త లుక్‌లో సూపర్బ్‌గా వున్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. సీమ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న మూవీలో రోల్‌కి తగ్గట్టుగా ఈ గెటప్‌ ఎంపిక చేసినట్టు మరోవైపు టాక్. లండన్ నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు రాగానే న్యూప్రాజెక్ట్ మొదలుకావచ్చని అంటున్నారు. అందులోనూ ఇప్పుడు ఆషాఢం కావడంతో, ఆగష్టు 4 లేదా 5 నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ వుందని, సెట్స్‌పైకి వెళ్లడం అంతా ఒకేసారి జరుగుతుందని అంటున్నారు.powerstar kotta getap

రీసెంట్‌గా లండన్‌లో నిర్వహించిన అక్కడి తెలుగు అసోసియేషన్‌ 6వ వార్షికోత్సవానికి పవన్ ముఖ్యఅతిధిగా హాజరయ్యాడు. 45 మందితో కూడిన కూచిపూడి నృత్య బృందాన్ని, కళలను ప్రొత్సహిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమ నిర్వాహకులను పవన్ స్పెషల్‌గా అభినందించనున్నాడు. వేడుకల్ని ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కళ సంస్కృతిలో ఓ అంతర్భాగమని చెప్పుకొచ్చాడు. 

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!