Breaking News
Home / news / బాలయ్య 100 వ చిత్రని మాటీవీ 9 కోట్లకు కొనేసిందట

బాలయ్య 100 వ చిత్రని మాటీవీ 9 కోట్లకు కొనేసిందట

బాలకృష్ణ ప్ర‌స్తుతం క్రిష్ డైరెక్ష‌న్‌లో త‌న కేరీర్‌లో ల్యాండ్ మార్క్ అయిన 100వ మూవీ గా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ క్రిష్ పెళ్లి నేప‌థ్యంలో చిన్న గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ కంటిన్యూగా షూటింగ్ జ‌రుపుకోనుంది.balayya 100 va chitrani maatv 9 kotlaku konesindata

చారిత్రక, పౌరాణిక సినిమాలు చేయడమంటే బాలకృష్ణకు చాలా ఇష్టం. త‌న 100వ సినిమాగా ఆంధ్ర‌ప్రదేశ్ ని   పాలించిన శాత‌వాహ‌న యువ‌రాజు ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో మనముందుకొస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతోంది.

కంచె సినిమాతో ఇలాంటి సినిమాల‌ను ఎలా డీల్ చేయాలో స‌త్తా చాటిని క్రిష్ చాలా పగడ్బందీగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌డంతో బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాను నమ్ముతున్నారు. అందుకే బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్ రేట్స్‌కి ఈ సినిమా అమ్ముడుపోతోంది.

ఓవర్సీస్‌లో కూడా ది బెస్ట్‌గా గౌతమీ పుత్రశాతకర్ణి నిలిచే అవకాశముంది. ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ని మాటీవీ 9 కోట్లకు కొనేసిందట. బాల‌య్య క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెపుతోంది. వ‌చ్చే సంక్రాంతికి గౌతమీ పుత్ర శాత‌క‌ర్ణి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!