Breaking News
Home / International News / భారత్‌ 353 ఆలౌట్‌.. విండీస్‌ 107/1

భారత్‌ 353 ఆలౌట్‌.. విండీస్‌ 107/1

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 353 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విండీస్‌ వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్‌ జాన్సన్‌ను 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్‌ రనౌట్‌ చేశాడు. ప్రస్తుతం క్రీజులో బ్రాత్‌వైట్‌ 53, బ్రావో 18 పరుగులతో ఉన్నారు.india

తొలి ఇన్నింగ్స్‌లో  అశ్విన్‌, సాహా సెంచరీలతో భారత్‌.. ఓ దశలో 339/5తో పటిష్ట స్థితిలో నిలిచినా.. 14 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయి భారీ స్కోరు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. తొలి రోజు భారత్‌ను దెబ్బ తీసిన యువ పేసర్‌ అల్జారి జోసెఫ్‌ (3/69).. సాహాను ఔట్‌ చేసి భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. రవీంద్ర జడేజా (6)ను కమిన్స్‌ పెవిలియన్‌ పంపాడు. ఆ తర్వాత ఐదు బంతుల తేడాతో భువనేశ్వర్‌ (0), అశ్విన్‌, ఇషాంత్‌ (0) ఔట్‌ కావడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 234/5తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియాను అశ్విన్‌, సాహా నడిపించారు. తొలిరోజు ఆటలో టీమ్‌ఇండియాను తక్కువ స్కోరుకే ఆలౌటయ్యే ప్రమాదం నుంచి బయటపడేసిన ఈ జంట.. రెండో రోజూ పట్టుదలగా బ్యాటింగ్‌ చేసింది. అశ్విన్‌ ఆచితూచి ఆడగా, సాహా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అశ్విన్‌ తొలిరోజు ఆటలోనే అర్ధసెంచరీ చేసుకోగా.. రెండోరోజు సాహా 135 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కొద్దిసేపట్లో లంచ్‌ అనగా.. అశ్విన్‌ సెంచరీ ముంగిట నిలిచాడు. 99 పరుగుల వద్ద లంచ్‌కు వెళ్లిన అశ్విన్‌… వచ్చిన వెంటనే చేజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఘనంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో అశ్విన్‌కు ఇది రెండో శతకం. కాసేపటికి చేజ్‌ బౌలింగ్‌లోనే రెండు పరుగులు చేసి.. సాహా కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీళ్ల శతకాలు పూర్తయిన తర్వాత భారత్‌ పతనం మొదలైంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 353 ఆలౌట్‌

రాహుల్‌ (సి)బ్రాత్‌వైట్‌(బి)ఛేజ్‌ 50; ధావన్‌ (సి)డౌరిచ్‌(బి)గాబ్రియల్‌ 1; కోహ్లి (సి)బ్రావో(బి)జోసెఫ్‌ 3, రాహానె (బి)ఛేజ్‌ 35; రోహిత్‌ శర్మ (సి)డౌరిచ్‌(బి)జోసెఫ్‌ 9; అశ్విన్‌ (సి)బ్లాక్‌వుడ్‌(బి)కమిన్స్‌ 118; సాహా (సి) డౌరిచ్‌(బి)జోసెఫ్‌ 104; జడేజా (సి)డౌరిచ్‌(బి)కమిన్స్‌ 6; భువనేశ్వర్‌ కుమార్‌ (సి)జాన్సన్‌ (బి)గాబ్రియల్‌ 0; షమీ నాటౌట్‌ 0; ఇషాంత్‌శర్మ (సి)జాన్సన్‌ (బి)కమిన్స్‌ 0

ఎక్స్‌ట్రాలు : 27

వికెట్ల పతనం: 1-9(ధావన్‌, 2.3ఓవర్‌), 2-19(కోహ్లీ, 5.3ఓవర్‌), 3-77(రాహుల్‌, 19.3ఓవర్‌), 4-87(రోహిత్‌శర్మ, 25.6ఓవర్‌), 5-126(రహానె, 49.3ఓవర్‌), 6-339(సాహా, 121.5ఓవర్‌), 7-351(జడేజా, 127.1 ఓవర్‌), 8-353(భువనేశ్వర్‌ కుమార్‌, 128.6ఓవర్‌), 9-353(అశ్విన్‌, 129.1ఓవర్‌), 10-353(ఇషాంత్‌శర్మ, 129.4ఓవర్‌)

విండీస్‌ బౌలింగ్‌: గాబ్రియల్‌ 23-4-84-2; జోసెఫ్‌ 24-6-69-3; కమిన్స్‌ 21.4-8-54-3; హోల్డర్‌ 19-7-34-0; ఛేజ్‌ 33-9-70-2; బ్రాత్‌వైట్‌ 9-1-27-0

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: 107/1

బ్రాత్‌వైట్‌(53 బ్యాటింగ్‌), జాన్సన్‌(23 రనౌట్‌), బ్రావో(18 బ్యాటింగ్‌)

ఎక్స్‌ట్రాలు-13

వికెట్ల పతనం: 1-59(జాన్సన్‌, 23.6ఓవర్‌)

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!