Breaking News
Home / news / కొరటాల శివ తో సై అనుటున్న ఎన్టీఆర్

కొరటాల శివ తో సై అనుటున్న ఎన్టీఆర్

ఈ న్యూస్ వార్త నిజం అయితే మాత్రం ఎన్టీఆర్ అభిమానులకు పండగే. ఆల్రెడీ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ తో‘జనతా గ్యారేజ్’ ప్రి రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాల్లోనూ హయ్యెస్ట్ రేట్స్‌కి జరుగుతోంది. ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులలో కూడా అంచనాలు మామూలుగా లేవు.koritala shivato sai anutunna ntr

‘జనతా గ్యారేజ్‌’ తరువాత వీళ్ళిద్దరూ కలిసి రెండో సినిమా చేస్తే అంచనాలు ఆకాశంలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ని సెట్ చేయడానికే డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ ట్రై చేస్తున్నాడు. భారీ సినిమాల డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్న సుధాకర్ ప్రిస్టేజియస్ మూవీతో ప్రొడ్యూసర్‌గా మారాలని ట్రై చేస్తున్నాడు.

అందుకు ఇంతకంటే క్రేజీ కాంబినేషన్ ఏముంటుంది. ఆల్రెడీ కొరటాల శివ కు అడ్వాన్స్‌ ఇచ్చిన సుధాకర్ ప్రస్తుతం ఎన్టీఆర్‌ని ఒఫ్పించే ప్రయత్నంలో ఉన్నాడట. కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌తో వెంటనే సినిమా చేయడానికి సై అనేశాడనేది యూనిట్ టాక్. జనతా గ్యారేజ్ అంచనాలను అందుకుంటే మాత్రం వెంటనే ఈ రెండో సినిమా కూడా పట్టాలెక్కుతుందనడంలో సందేహం లేదు.ntr 2

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!