Breaking News
Home / news / ‘పెళ్ళిచూపులు’ సందడి

‘పెళ్ళిచూపులు’ సందడి

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ‘పెళ్ళిచూపులు’ అనే చిన్న సినిమా రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రోజురోజుకూ ఆదరణ పెంచుకుంటూ మంచి వసూళ్ళు రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ అయిన ఏ సెంటర్స్, యూఎస్‌లో కలెక్షన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.Pellichoopulu sandadi

ఇక ఇదిలా ఉంటే చెన్నైలో ఉన్న తెలుగు సినీ అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులూ చూసేలా, సబ్‌టైటిల్స్‌తో అక్కడ సినిమాను గత వారమే విడుదల చేశారు. దీంతో ఈ వారాంతం చెన్నై బాక్సాఫీస్ వద్ద ‘పెళ్ళిచూపులు’ సినిమా మంచి వసూళ్ళను రాబట్టి నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. పలు క్రేజ్ ఉన్న హాలీవుడ్ సినిమాలు, రజనీ కాంత్ ‘కబాలి’ సినిమాతో పాటు టాప్ 5లో పెళ్ళిచూపులు స్థానం దక్కించుకుంది.

ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఒక చిన్న సినిమా, బాక్సాఫీస్ వద్ద ఇలా మంచి వసూళ్ళు రాబట్టడం విశేషంగానే చెప్పుకోవాలి. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈమధ్యకాలంలో వచ్చిన రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల నుంచి సినిమా మంచి కితాబులందుకుంటోంది. రాజ్ కందుకూరి యష్ రాగినేని నిర్మించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!