Breaking News
Home / news / ఖైదీ సినిమా పై ఇన్ సైడ్ ఇండస్ట్రీ స్పెషల్ రివ్యూ

ఖైదీ సినిమా పై ఇన్ సైడ్ ఇండస్ట్రీ స్పెషల్ రివ్యూ

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను రెండు ద‌శాబ్దాల పాటు ఏక‌చక్రాధిప‌త్యంగా ఏలిన ఘ‌న‌త మెగాస్టార్ చిరంజీవిది. మెగాస్టార్‌గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర‌స్థానం ఏర్ప‌రుచుకున్న చిరంజీవి ప‌దేళ్ల పాటు వెండితెర‌కు దూరంగా ఉన్నారు.

ఈ 10 ఇయర్స్ లో చిరంజీవి కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే వెండితెర‌మీద గెస్ట్‌ రోల్స్‌ లో క‌నిపించారు. రామ్ చరణ్ మ‌గధీర‌-బ్రూస్‌లీ సినిమాల్లో త‌ళుక్కున మెరిసిన చిరంజీవి ప‌దేళ్ల త‌ర్వాత తిరిగి హీరోగా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

చిరంజీవి 10 ఇయర్స్ త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా కావడంతో అంద‌రి దృష్టి చిరంజీవి మీదే ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌లో చిరంజీవి డైలాగ్స్‌, యాక్ష‌న్ చూస్తే చిరంజీవి లో పాత గ్రేస్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నిపిస్తోంది. చిరంజీవి డ్యాన్సుల్లోను, డైలాగ్స్‌లోను ఇర‌గ‌దీసేశాడ‌ట‌. ఓవ‌రాల్‌గా ఖైదీలో చిరంజీవి పాత్రమీదే అంద‌రి దృష్టి ఉండ‌డంతో ఆ భారీ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చిరంజీవి పెర్పామెన్స్ అమజింగ్ గా ఉందిట.

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మాస్ సినిమాల‌ను తిరుగులేని స్టైల్లో తెర‌కెక్కించ‌డంలో స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్‌ది అందెవేసిన చేయి. అఖిల్ లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చిన వినాయ‌క్ ఇప్పుడు క‌సితో ఖైదీ నెంబ‌ర్ 150ను తెర‌కెక్కించాడు. కోలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన స్టొరీ కావ‌డంతో దానిని వినాయ‌క్ త‌న‌దైన స్టైల్లో టేకింగ్‌లో రాజీప‌డ‌కుండా చాలా బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు అంట.

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

దేవిశ్రీప్ర‌సాద్ తన మార్క్ మ్యూజిక్ తో కుమ్మేసాడు అంట.మాస్ బీట్ల‌తో దేవిశ్రీప్ర‌సాద్ వీరంగం ఆడేశాడు. ర‌త్తాలు..ర‌త్తాలు, లెట్స్ డు కుమ్ముడు, సుంద‌రి మాస్ బీట్‌లో ఉంటే క‌న్నీటి సాంగ్ సినిమాలో ఎమోష‌న్ స్థాయిని పీక్ స్టేజ్‌లో ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ చేసేలా ఉంది.ఫైనల్ గా దేవిశ్రీప్ర‌సాద్ఇచ్చిన ఆర్ ఆర్‌ కూడా సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోయింది.

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!