Breaking News
Home / news / ఖైదీ నెంబర్ 150 దుబాయ్ ఎక్స్ క్లూసివ్ రివ్యూ

ఖైదీ నెంబర్ 150 దుబాయ్ ఎక్స్ క్లూసివ్ రివ్యూ

టైటిల్‌: ఖైదీ నెంబ‌ర్ 150
బ్యాన‌ర్‌: కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: కొణిదెల సురేఖ‌
న‌టీన‌టులు: మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.ర‌త్న‌వేలు
ఎడిటింగ్‌: గౌతంరాజు
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
క‌థ‌: ఏఆర్‌.మురుగ‌దాస్‌
డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌ద్స్ – వేమారెడ్డి – బుర్రా సాయిమాధ‌వ్‌
నిర్మాత‌: రాంచ‌ర‌ణ్
స్క్రీన్‌ప్లే – ద‌ర్శ‌క‌త్వం: వివి.వినాయ‌క్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
రిలీజ్ డేట్‌: 11 జ‌న‌వ‌రి, 2016

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ను రెండు ద‌శాబ్దాల పాటు ఏక‌చక్రాధిప‌త్యంగా ఏలిన ఘ‌న‌త మెగాస్టార్ చిరంజీవిది. మెగాస్టార్‌గా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర‌స్థానం ఏర్ప‌రుచుకున్న చిరంజీవి 10 ఏళ్ళు పాటు వెండితెర‌కు దూరంగా ఉన్నారు. 2007లో వ‌చ్చిన శంక‌ర్‌దాదా జిందాబాద్ త‌ర్వాత చిరు కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే వెండితెర‌మీద గెస్ట్‌రోల్స్‌లో క‌నిపించారు. రామ్ చరణ్ మ‌గధీర‌-బ్రూస్‌లీ సినిమాల్లో త‌ళుక్కున మెరిసిన చిరంజీవి ప‌దేళ్ల త‌ర్వాత తిరిగి హీరోగా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ అయిన క‌త్తి సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాను వివి.వినాయ‌క్ డైరెక్ట్ చేయ‌గా చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ స‌మ‌ర్ప‌ణ‌లో చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు.

ఖైదీ నెంబ‌ర్ 150 క‌థ అంచ‌నా :
ఖైదీ నెంబ‌ర్ 150 స్టోరీ చాలా మందికి తెలిసిందే. రైతుల స‌మ‌స్య‌ల కోసం ఓ యువ‌కుడు చేసిన పోరాట‌మే ఈ సినిమా మెయిన్ థీమ్‌. క‌ల్తీ ఎరువుల వాడిన వ‌రుస‌గా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీల కోసం ప్ర‌భుత్వం రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూసేక‌ర‌ణ చేస్తుంటుంది. కార్పొరేట్ కంపెనీలు భూ, జ‌ల‌వ‌న‌రుల‌ను దోపిడీ చేయ‌డంతో ఆ ప్ర‌భావం వ్య‌వ‌సాయంపై ప‌డి రైతులు పంట‌లు పండ‌క, అప్పులు తీర‌క ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటూ ఉంటారు. రైతుల కోసం పోరాటం స్టార్ట్ చేసిన హీరో చివ‌ర‌కు ప్ర‌భుత్వ పునాదులు క‌దిలేలా చేయ‌డంతో పాటు ప్ర‌జా వ్య‌వ‌స్థ‌ను స్తంభింప‌చేస్తాడు. చివ‌ర‌కు ప్ర‌భుత్వం ఎలా దిగి వ‌చ్చింది ? ఈ పోరాటం ద్వారా రైతుల స‌మ‌స్య‌ల‌కు ఎలా ముగింపు ప‌లికింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

మీ ఫేవరేట్ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ చానెల్ ని సబ్ స్రైబ్ చేయండి.లేటెస్ట్ అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పొందడి.

న‌టీన‌టుల పెర్పామెన్స్ అంచ‌నా :
చిరంజీవి 10 ఇయర్స్ త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా కావడంతో అంద‌రి దృష్టి చిరంజీవి మీదే ఉంది. ఇప్ప‌టికే విడుదల అయిన టీజ‌ర్‌లో చిరంజీవి డైలాగ్స్‌, యాక్ష‌న్ చూస్తే చిరంజీవిలో పాత గ్రేస్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌నిపిస్తోంది. చిరంజీవి డ్యాన్సుల్లోను, డైలాగ్స్‌లోను ఇర‌గ‌దీసేశాడ‌ట‌. ఓవ‌రాల్‌గా ఖైదీలో చిరంజీవి పాత్రమీదే అంద‌రి దృష్టి ఉండ‌డంతో ఆ భారీ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా చిరంజీవి పెర్పామెన్స్ ఉండ‌నుంద‌ట‌. చిరంజీవి ప‌క్క‌న రొమాన్స్ చేస్తోన్న మెరుపుక‌ళ్ల కాజ‌ల్‌కు ఈ స్టోరీ బేస్‌డ్ సినిమాలో ఎలాంటి రోల్ ఉంటుందో చూడాలి. పాటల్లో మాత్రం ఆమెతో చిరంజీవి చేసే డ్యాన్స్ ర‌చ్చ మామూలుగా ఉండ‌ద‌నిపిస్తోంది. ఇక ర‌త్తాలు ఐటెం సాంగ్‌లో రాయ్‌ల‌క్ష్మీ అందాలు మాస్ ప్రేక్ష‌కుల‌కు మంచి విందుభోజ‌నం. లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌లో రామ్ చరణ్ స్టెప్పుల‌తో గెస్ట్ రోల్ మ‌రో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కానుంది. చూడాల‌ని ఉందిలో చిరంజీవి హీరోయిన్ అంజ‌లా ఝ‌వేరి భ‌ర్త త‌రుణ్ అరోరా విల‌న్‌గా స్టైలీష్‌గాను, క్రూర‌మైన యాంగిల్‌లోను చిరుకు ధీటుగా న‌టించాడ‌ని టాక్‌. ఇక చిరు రోల్‌తో ట్రావెల్ అయ్యే క‌మెడియ‌న్‌గా ఆలీ, చిరంజీవి ఇరికించ‌బోయి తానే ఇరుక్కునే రోల్‌లో బ్ర‌హ్మానందం మిగిలిన పాత్ర‌ల్లో న‌టించారు.

సాంకేతిక‌త అంచ‌నా :
టెక్నిక‌ల్‌గా ముందుగా దేవిశ్రీప్ర‌సాద్ సాంగ్స్ కుమ్మేశాయి. మాస్ బీట్ల‌తో దేవి వీరంగం ఆడేశాడు. ర‌త్తాలు..ర‌త్తాలు, లెట్స్ డు కుమ్ముడు, సుంద‌రి మాస్ బీట్‌లో ఉంటే క‌న్నీటి సాంగ్ సినిమాలో ఎమోష‌న్ స్థాయిని పీక్ స్టేజ్‌లో ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ చేసేలా ఉంది. ఇక దేవి ఆర్ ఆర్‌కూడా అదర‌గొట్టేశాడ‌ని టాక్‌. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీకి వంక‌పెట్టే సాహ‌సం చేయ‌లేం. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు చాలా ఫ్ల‌స్ కానుంది. ఇక ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ – వేమారెడ్డి – బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్ కామెడీ, యాక్షన్‌, ఎమోష‌న‌ల్‌గా అన్ని యాంగిల్స్‌లో అద‌ర‌గొడుతాయ‌ని టాక్ వ‌చ్చింది. ర‌న్ టైం కాస్త ఎక్కువు అన్న టాక్ వ‌చ్చినా సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు క్రిస్పీగానే సీన్లు ఎడిట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక చిరంజీవి కేరీర్‌లో ల్యాండ్ మార్క్ సినిమా కావ‌డంతో పాటు చిరంజీవి భార్య స‌మ‌ర్ప‌ణ‌లో చిరంజీవి త‌న‌యుడే ఈ సినిమాను నిర్మించ‌డంతో నిర్మాణ విలువ‌లు అత్యున్న‌త స్థాయిలో ఉండ‌నున్నాయి.

వినాయ‌క్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:
టాలీవుడ్‌లో మాస్ సినిమాల‌ను తిరుగులేని స్టైల్లో తెర‌కెక్కించ‌డంలో స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్‌ది అందెవేసిన చేయి. అఖిల్ లాంటి డిజాస్ట‌ర్ ఇచ్చిన వినాయ‌క్ ఇప్పుడు క‌సితో ఖైదీ నెంబ‌ర్ 150ను తెర‌కెక్కించాడు. కోలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన స్టొరీ కావ‌డంతో దానిని వినాయ‌క్ త‌న‌దైన స్టైల్లో టేకింగ్‌లో రాజీప‌డ‌కుండా చాలా బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాన‌ని ఆయ‌న ధీమాతో ఉన్నారు. ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూల్లో సైతం వినాయ‌క్ సినిమా సూప‌ర్ హిట్ అని చెప్పుతున్నారు. గ‌తంలో చిరంజీవి – వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన ఠాగూర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఠాగూర్‌లోలా ఈ సినిమాలో సైతం వినాయ‌క్ ఓ రోల్‌లో మెర‌వ‌డంతో ఈ సెంటిమెంట్లు కూడా వీరి కాంబోలో మ‌రో హిట్ క‌న్‌ఫార్మ్ అన్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ప‌క్కా మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వినాయ‌క్ ఈ సినిమాను డీల్ చేసిన‌ట్టు టాక్‌.
ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డు :
సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల దృష్ట్యా ఖైదీ నెంబర్ 150 సినిమాకు వ‌రల్డ్ వైడ్‌గా రూ 92.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ సైతం రూ.13 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. ఓవ‌రాల్‌గా రూ.100 కోట్ల బిజినెస్ చేసిన ఖైదీ ఫ‌స్ట్ డే భారీ ఎత్తున అత్య‌ధిక థియేట‌ర్ల‌లో విడుదల అవుతుండ‌డంతో రూ.30 కోట్ల వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. ఖైదీ ఓవ‌ర్సీస్‌లో 200, క‌ర్ణాట‌క‌లో 200, ఏపీ, తెలంగాణ‌లో 1700 థియేట‌ర్ల‌లో పెద్ద ఎత్తున రేపు రిలీజ్ అవుతోంది.

రేటింగ్ :4/5

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!