Breaking News
Home / news / రామ్ చరణ్ సంతృప్తి చెందినట్లుగా కనిపించలేదట

రామ్ చరణ్ సంతృప్తి చెందినట్లుగా కనిపించలేదట

టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శకుడు కోదండరామిరెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ తరం వెనక స్టార్ డైరెక్టర్ అయిన ఈయన.. తన కెరీర్ లో చాలానే బ్లాక్ బస్టర్స్ అందించాడు. అంతకంటే ఎక్కువగా.. మెగాస్టార్ చిరంజీవి తో బోలెడన్ని హిట్ సినిమాలు తీసిన హిస్టరీ ఈయనకు ఉంది.

చిరంజీవి ను ఖైదీ సినిమాతో స్టార్ హీరో చేసిన క్రెడిట్ కూడా కోదండరామిరెడ్డిదే. కానీ ఇప్పుడు ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఈయనను పిలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు కారణంగా.. తాజాగా జరిగిన ఓ సంఘటనను చూపిస్తున్నారు విమర్శకులు.

చిరంజీవితో ఇప్పుడు సినిమా చేసే అవకాశం తనకు వస్తే మంచి కామెడీ సినిమా చేస్తానని.. అంతే తప్ప మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తీస్తే జనాలు నవ్వుతారని అన్నాడు కోదండరామిరెడ్డి వ్యాఖ్యానించడం వివాదం అయింది. అయితే చిరంజీవి సినిమాలను ఎంటర్టెయిన్మెంట్ యాంగిల్ లో చూడాలని ప్రజలు కోరుకుంటారని వివరణ ఈయన ఇచ్చాడు కానీ రామ్ చరణ్ సంతృప్తి చెందినట్లుగా కనిపించలేదట. అందుకే ఖైదీ నంబర్ 150 ఫంక్షన్ కు పిలవలేదని అంటున్నారు.

X

About mainadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!